తాజాగా వకీల్ సాబ్ గా అభిమానుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పవన్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ ఈరోజు నేతలతో మాట్లాడుతున్నారు. అయితే, రేపు నాయుడుపేటలో జరిగే బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా కాకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటె, రేపు నాయుడుపేటలో భారీ బహిరంగ సభకు బీజేపీ, జనసేన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారు. ఈ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాల్సి ఉన్నది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లో ఉండటంతో రేపు జరిగే సభకు హాజరయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. అలాగే ప్రస్తుతం పవన్ వరుసగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ పడినట్లు అయ్యింది.
previous post