telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కృష్ణపట్నం పోర్టు మొత్తం సొంతం చేసుకున్న అదానీ…

కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకుంది అదానీ పోర్ట్స్ లిమిటెడ్… తాజాగా, విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసింది అదానీ పోర్ట్స్ లిమిటెడ్… దీంతో.. ఏడాదిలోగానే కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటాలను ఆదానీ చేజిక్కించుకున్నారు.. ఆ 25 శాతం వాటా విలువ రూ. 2800 కోట్లు ప్రకటించింది అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్… మొత్తంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయించారు.. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్… 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు విలువను రూ. 13,675 కోట్లుగా పేర్కొంది.. మరోవైపు.. ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం పోర్టు.. 2025 నాటికి 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అదానీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే చూడాలి మరి ఇంకనుండి అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అనేది.

Related posts