వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సెక్షన్ 144, 33 లను విచ్చలవిడిగా వాడుతున్నారని.. అదృష్టం అందలమెక్కిస్తే.. బుద్ధి బురదలోకి లాగినట్లు వైసీపీ తీరుందని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని… మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇవాళ తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని… ఈ దాడులు ఇలానే కొనసాగితే మేమూ సహనాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని… ఇతర పార్టీల నేతలు మాట్లాడితే మాత్రం దాడులకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. ఆలయాల్లో విగ్రహాలపై దాడులు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. అదే.. మసీదులు, చర్చ్లపై దాడులు జరిగితే గగ్గోలు పెడుతున్నారని.. 142 దేవాలయాలపై దాడులు జరిగితే ఇంతవరకు ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. సెక్యూలరిజం అంటే ఇదేనా..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
previous post


ఆంధ్రా మరో బీహార్ లా తయారైంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు