జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ఇసుక అమ్ముతామని ప్రకటనలు ఏంటి అని ప్రశ్నించారు.
అందరికీ అందుబాటులో ఇసుక..పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక అంటూ ప్రకటనలు చేయడంపై మండిపడ్డారు.
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం, పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం ‘ అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? అని పవన్ ట్వీట్ చేశారు.
పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..