సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో అథిగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వేదికపై నుంచి ఓ రేంజ్‌లో ఏపీ ప్రభుత్వం, వైకాపా నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. సినిమా ఫంక్షన్ కాస్తా… దీంతో పొలిటికల్ సభగా మారిపోయింది.

దీంతో ..పవన్ చేసిన వ్యాఖ్యలు పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ ను టార్గెట్ చేస్తూ అభ్యంతరక పదాలుతో కౌంటర్లు వేశారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా పేర్ని నాని పంచ్ లు మీద పంచ్‌లు వేసారు.
ఆ తర్వాత ఇదే ఎపిసోడ్‌లోకి సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని ఓ రేంజ్‌లో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. వైసీపీ గ్రామసింహాలు అంటూ సెటైర్లు పేల్చారు.. అటు నుంచి కూడా అదే రేంజ్‌లో ట్వీట్లు. కాసేపు సీన్ ట్విట్టర్‌కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత సీన్‌లోకి పవన్ ఫ్యాన్స్ వచ్చారు.

ట్వీట్లు, మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో రెచ్చిపోయారు పవన్ ఫ్యాన్స్. పర్సనల్ విషయాలనూ టచ్ చేశారు. అంతే పోసానికి కోపం నశాలానికి అంటింది. మళ్లీ ప్రెస్‌ముందుకు వచ్చారు. ఈసారి మరింత రెచ్చిపోయారు. పవన్ ఫ్యాన్స్ పోసానిని టార్గెట్ చేసి అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న బూతులు మొత్తం వాడేసారు. ప్రెస్ మొత్తం బీప్ సౌండ్‌లతో రీసౌండ్ వచ్చింది.
ఆ తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర హై వోల్టేజ్ టెన్షన్. దీంతో అక్కడ అంతా యుద్ధవాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ స్టేట్ ఇంచార్జ్ శంకర్ గౌడ్ .

