సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, కయ్యానికి కాలు దువ్వుతోంది. .జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
భారత్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాక్ స్థావరాలను కూడా భారత్ సైనికులు ధ్వంసం చేశారు. నిన్న పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఫూంచ్ జిల్లాలో రెండు ఇండ్లు ధ్వంసమైన తెలిసిందే.


పట్టు పెంచుకోవాలేతప్ప.. శత్రుత్వం పెంచుకోకూడదు: ఉండవల్లి