telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక : … ఎమ్మెల్యేను .. వెయ్యి కోట్లతో బీజేపీ .. బేరాలు..

బీజేపీ రాష్ట్రంలో రాజీనామ చేసిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెయ్యి కోట్ల రుపాయలను ఖర్చు చేస్తుందని జేడీఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మోడీ, అమిత్ షాలు చెబుతున్నట్టు అవినీతి రహిత పాలన కేవలం పుస్తకాలకే పరిమితమవుతుందని విమర్శించారు. కాగా బీజేపీకి వెయ్యికోట్ల రుపాయాలు ఎక్కడి నుండి, ఎలా వస్తున్నాయని వారు ప్రశ్నించారు. కాగా వెయ్యి కోట్ల రుపాయాలు ఈశాన్య రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌లో సుమారు 10 శాతమని తమ పార్టీ ట్విట్లర్లో పేర్కోన్నారు. ఇప్పటికే కర్టాటకలో జరుగుతున్న రాజకీయ సక్షోభం బీజేపీ ప్రోద్భలంతోనే కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఎమ్మెల్యేల రాజీనామ డ్రామ ప్రధాని మోడీ, అమిత్ షాల కనుసన్నల్లో కొనసాగుతుందని ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను తిప్పికోట్టింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నేత ఆదీర్ రంజన్ చౌదరీ సైతం పార్లమెంట్‌లో లేవనెత్తాడు. ముమ్మాటికి కేంద్రం సహకారంతోనే రాజీనామాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. బీజేపీయోతర ప్రభుత్వాలను కూలదోసే కుట్రలకు బీజేపీ తెర లేపిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబాయికి వెళ్లేందుకు విమానాలు ఎర్పాటు చేయడం దగ్గర నుండి హోటల్ ఎర్పాట్లు చేయడం వరకు బీజేపీ చేస్తుందని ఆయన మండిపడ్డారు. దీంతో ప్రభుత్వ చర్యకు నిరసనగా వాకౌట్ సైతం చేశారు.

Related posts