telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఒకప్పుడు హీరో అడవులను కాపాడేవాడు గాను, ఇప్పుడు అడవులు నరికి స్మగ్లింగ్ చేసే వాడిని హీరో గా చూపిస్తున్నా రు: పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

40 ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరోగా చూపించేవారు. ఇప్పుడు అడవులు నరికి  స్మగ్లింగ్ చేసే పాత్రలను హీరోలుగా చూపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.

మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకప్పుడు హీరో రాజ్కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారు.

ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిస్తున్నాయన్నారు పవవ్. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని కర్నాటక పర్యటనలో ఉన్న పవన్ పేర్కొన్నారు.

కాగా ఏపీలో పవన్ అటవీశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Related posts