స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 21వ సినిమాపై అఫిసియల్ అనౌన్స్ చేసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ‘కొరటాల శివతో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నానని ప్రకటించడంపై సంతోషంగా ఉంది. ఆయనతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన సుధాకర్ గారికి నా శుభాకాంక్షలు” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. పలు భాషలలో రూపొందనున్న ఈ బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఉంటుందని అంటున్నారు. 2022లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో’ ఐకాన్ ‘అనే మూవీ కూడా చేయాల్సి ఉంది. వేణు శ్రీరామ్ దర్శకుడు.
కొరటాలతో సినిమా పూర్తయ్యాక ఐకాన్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కొద్ది రోజులుగా కొరటాల శివతో అల్లు అర్జున్ మూవీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. బన్నీ ఇందులో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడని సమాచారం. కొరటాల తీసే సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అంతర్లీనంగా సామాజిక సందేశం ఇచ్చేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి అంశాలతోనే తెరకెక్కబోతోంది. ఓటమి ఎరుగని కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, మంచి ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్ జత కలవడంతో ఈ సినిమాపై అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు.
previous post