ఆయుధ ప్రయోగాలతో అమెరికాకే వెన్నులో వొణుకుపుట్టిస్తున్న ఉ.కొరియా మరో ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసింది. సుదూర లక్ష్యాలను చేధించే రాకెట్ లాంచర్ నుండి మరో కీలకమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. భవిష్యత్‌లో వ్యూహాత్మక అణునిరోధాన్ని మరింత బలోపేతం చేసేవిధంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపింది. అణు చర్చలపై తుది గడువు నిర్ణయించాలని ట్రంప్ పాలనా యంత్రాంగంపై ఉత్తరకొరియా వత్తిడి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు శనివారం ప్రకటించింది. అయితే శుక్రవారం నిర్వహించిన ఈ పరీక్షపై ఉత్తర కొరియాకు చెందిన అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్సెస్ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

