ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖలో బిల్లుల చెల్లింపుపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.
బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంపై కొందరు వేసిన పిటీషన్ ను న్యాయస్థానం విచారించింది. బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని సీనియర్ న్యాయవాది అంబటి సుధాకర్ రావు వాదనలు వినిపించారు
అయితే ఈ విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హాజరయ్యారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో హైకోర్టు న్యాయవాది జస్టిస్ బట్టుదేవానంద్ నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేశారు


భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి