telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

‘కాంగ్రెస్’ ను పూర్తిగా వీడిన .. మమత .. !

21 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘కాంగ్రెస్’ పార్టీని వీడారు. 1998లో ఆల్ ఇండియా ‘తృణమూల్ కాంగ్రెస్’ పార్టీని స్థాపించారు. నాడు పార్టీ లోగోలో తృణమూల్ కాంగ్రెస్ అని రాయించారు. కానీ ఇప్పుడు ఆ లోగోలో కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించి.. తృణమూల్‌ను మాత్రమే ఉంచారు. తృణమూల్‌ను ఆకుపచ్చ రంగుతో రాయించగా, ఫ్లవర్స్ వెనుకాల మాత్రం నీలం రంగును ఉంచారు.

ఆ పార్టీ నాయకుడు లోగో మార్పునకు సమయం ఆసన్నమైనందునే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర సామాగ్రిపై కూడా కేవలం ‘తృణమూల్’ అని మాత్రమే రాయించడం విశేషం. దీనితో జాతీయ కూటమి ఏర్పాటుపై మమత అభిప్రాయం తెలిసిపోతుంది.

Related posts