telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెపోటిజంపై ఇర్ఫాన్ ఖాన్ తనయుడి వ్యాఖ్యలు

Sushanth

సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి కారణమనే వాదనను ప్రజలు బలంగా నమ్ముతున్నారంటే… తాజాగా నెటిజన్లు పలువురు సెలబ్రిటీలను ఆన్ ఫాలో చేసిన తీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొడుకు బాబిల్‌ ఖాన్‌ను సుశాంత్‌కి మద్దతుగా చేపడుతున్న పోరాటంలో అండగా నిలవాలని నెటిజన్ కోరాడు. దీనిపై స్పందించిన బాబిల్‌ నటనలో మార్పులు తీసుకొచ్చిన ఇర్ఫాన్ తనయుడిగా ఉండటం అంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. నెపోటిజంకి వ్యతిరేఖంగా జరుగుతున్న పోరాటాన్ని నేను అర్ధం చేసుకుంటాను. కాకపోతే ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయని అన్నారు

Related posts