ప్రస్తుతం నితిన్, కీర్తి సురేష్ తొలి కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.మార్చి 26న ధియేటర్ లలో ‘రంగ్ దే’ సంబరాలు షురూ కానున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అయితే మాములుగా ఈ సినిమాలో నైనా హీరో. హీరోయిన్స్ ప్రేమించుకోవడంలో కష్టాలు పడి సినిమా క్లైమాక్ లో పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ సినిమాలో పెళ్లి తర్వాత వారు పడే కష్టాలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ ముట్టుకోకుండానే ఫిష్ కు కడుపు వచ్చిందా…? అనే డైలాగ్ తో ఎండ్ అవుతుంది. అయితే పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన వచ్చిన నేపథ్యంలో ‘రంగ్ దే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఇదే సంస్థ నితిన్ తో తీసిన ‘అ ఆ’, ‘భీష్మ’ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post