మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “క్రాక్”. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రవితేజ కొత్త స్టిల్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో మీసం తిప్పుతున్న రవితేజ మాస్ లుక్ తో సినిమా పై అంచనాలు పెరుగుపోయాయి అనే చెప్పాలి. ఈ పోస్టర్ లో రవితేజ వేసుకున్న పోలీస్ డ్రెస్ పై ‘పి. వీర శంకర్’ అనే పేరు కనిపిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కరోనా నేపథ్యంలోనూ ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. గతంలో రవితేజతో ”డాన్ శీను, బలుపు” లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని.. ‘క్రాక్’ రూపంలో మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేదు. ఎన్నో ఆశల మధ్య వచ్చిన డిస్కోరాజా సినిమా నిరాశపరిచింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.
previous post
next post


స్టార్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు