‘అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సమాయత్తమవుతున్న “ఊర్వశి ఓటిటి” కార్యాలయం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో సంచలన రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోస్ తో ‘ఊర్వశి ఓటిటి’ తెలుగువారిని ఉర్రూతలూగించాలని విజయేంద్రప్రసాద్ ఆకాక్షించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందించడంతోపాటు… విడుదల పరంగానూ సపోర్ట్ చేయనుండడం “ఊర్వశి ఓటిటి” ప్రత్యేకత కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
తమ “ఊర్వశి ఓటిటి” కార్యాలయం విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదలు కావడం సంతోషంగా ఉందని ‘ఊర్వశి ఓటిటి’ డైరెక్టర్స్ ఎం.ఎస్.రెడ్డి-రవి కనగాల పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు “ఊర్వశి ఓటిటి”లో ఉచితంగా చూసే అవకాశాన్ని ‘ఇనాగురల్ ఆఫర్’గా ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు!!
previous post
next post


చంద్రబాబు సేవలు దేశానికి అవసరం: కనకమేడల