యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన తాజా చిత్రం “సాహో” నుంచి యాక్షన్ లుక్‌లో ఉన్న మరో పోస్టర్‌ను “హే డార్లింగ్స్.. నా సాహో చిత్రం నుంచి రెండో పోస్టర్ ఇది” అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. ఈ లుక్ లో ప్రభాస్ స్టైలిష్‌గా గాగూల్స్ ధరించి, చెవిలో బ్లూటూత్‌తో రేస్ బైక్‌పై యాక్షన్ లుక్‌లో ప్రభాస్ అదరగొడుతున్నాడు. ఈ లుక్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “సాహో” ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా కన్పించనుంది. ఈ సినిమాకు సంబంధించి “షేడ్స్ ఆఫ్ సాహో” అంటూ రెండు మేకింగ్ వీడియోలను గతంలో విడుదల చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇటీవల ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదచేసిన కొత్త పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ నటీనటులు, హాలీవుడ్ తారాగణం ఈ సినిమా మేకింగ్‌లో పాల్గొన్నారు.
previous post

