telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ధూమ్-4″లో ప్రభాస్ ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ‘ధూమ్-4’లో నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ధూమ్ సిరీస్ సినిమాల్లో హీరో పాత్ర నామమాత్రమే. విలన్‌దే కీలక పాత్ర. మొదటి సినిమలో జాన్ అబ్రహమ్, రెండో సినిమాలో హృతిక్ రోషన్, మూడో సినిమాలో ఆమిర్ ఖాన్ విలన్ పాత్రల్లో కనిపించారు. మూడు సినిమాల్లోనూ విలన్‌ను పట్టుకునే హీరో పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించాడు. ఈ మూడు సిరీస్ లు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం అందరి చూపు ‘ధూమ్4’ పైనే ఉంది.‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు 600 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కచ్చితంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలి. మొదట ఈ సినిమాకి హీరోగా షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఈ సినిమాకి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితేనే కరెక్ట్ అని, ‘ధూమ్4’ ప్రభాస్ తోనే తెరకెక్కించాలని నిర్మాత ఎదురు చూస్తున్నాడని తెలుస్తుంది. ‘బాహుబలి2’ విడుదలైనప్పటి నుండీ ఆదిత్య చోప్రా అదే పనిలో ఉన్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.’రాధేశ్యామ్’ సినిమా ,నాగ్ అశ్విన్ తో ఓ సినిమా,అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అవి పూర్తయ్యాక ‘ధూమ్4’ ఓకే అయ్యే అవకాశం ఉంది. ఇక ధూమ్ 4 లో ప్రభాస్ నటిస్తున్నారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Related posts