మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనాపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం తాజాగా నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు.
తాజాగా..రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని షేర్ చేసింది ఉపాసన. అందులో దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఫోటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారని, ఎక‍్కడో కనిపెట్టండి అంటూ ఉపాసన ఫాలోవర్స్‌ని కోరారు. ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని.. అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసనా రాసుకొచ్చారు.
దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి పోస్టులు పెట్టి మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.