telugu navyamedia
సినిమా వార్తలు

కొందరు హీరో హీరోయిన్లు సిగ్గులేకుండా… : కంగనా రనౌత్

Kangana Ranaut images

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి ఘాటుగా స్పందించింది. అవసరానికి కొందరు నటీనటులు సిగ్గు లేకుండా తనకు ఫోన్ చేస్తారని, తనకు అవసరం అయినప్పుడు మాత్రం ఎవరూ ముందుకు రారని ఫైర్ అయ్యింది కంగనా.

2014లో కంగనా నటించిన “క్వీన్” సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ క్రెడిట్ మొత్తాన్ని తీసేసుకుంది, ఎక్కడకు వెళ్లినా… ఆ సంస్థ తెరకెక్కించిన సినిమాల స్క్రీనింగ్స్ ను ప్రదర్శించేవారని, తన గురించి మాత్రం ఎవరూ మాట్లాడేవారు కాదని, తన సినిమాల స్క్రీనింగ్ కు ఎవరూ వచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. వారికేదైనా అవసరం వస్తే మాత్రం సిగ్గు లేకుండా ఫోన్లు చేస్తారని, అప్పుడు వాళ్ళకోసం షూటింగ్ క్యాన్సల్ చేసుకుని మరీ వెళ్లేదాన్నని తెలిపింది.

“రాజి” సినిమా విడుదలప్పుడు అలియా భట్, దర్శకుడు మేఘనాలతో అరగంట మాట్లాడాను అని, అలియా తనకు ట్రైలర్ లింక్ పంపించి ప్లీజ్ చూడండి అంటూ కోరిందని, అందుకే ఆ ట్రైలర్ చూసి తనను అభినందించానని తెలిపింది కంగనా. తన సినిమాకు రమ్మని పిలిస్తే మాత్రం ఎవరూ స్పందించలేదని మండిపడింది. అమీర్ ఖాన్ నటించిన “దంగల్” సినిమా గురించి మాట్లాడడానికి అంబానీ ఇంటికి వెళ్లారని తెలిసి అభినందించడానికి తాను కూడా వెళ్లానని గుర్తు చేసుకున్నారు కంగనా. సాటి నటీనటుల పనితీరును పొగడడానికి తనకు ఎలాంటి ఈగో ఉండదని స్పష్టం చేసింది క్వీన్.

Related posts