telugu navyamedia
సినిమా వార్తలు

అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ… ట్రోలింగ్ స్టార్ట్

Vijay-Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఐస్ క్రీమ్ లను ఉచితంగా పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇది తన సినిమా ప్రమోషన్స్ కి కూడా బాగా ఉపయోగపడింది. అఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిన్నప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లో పిల్లలందరికీ చాక్లెట్స్ పంచుతుంటే చాలా హ్యాపీగా ఉండేదని చెప్పాడు. ఇక్కడే పాపం మన హీరో సోషల్ మీడియా జనాలకు దొరికిపోయాడు.

మే నెలలో పిల్లలకు సెలవులు ఉంటాయి. విజయ్ చదివింది పుట్టపర్తిలో.. అక్కడ కూడా సెలవులిస్తారు. మేలో పుట్టిన ఎవరూ కూడా స్కూల్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేరు. కానీ మన హీరో మాత్రం స్కూలూ, చాక్లెట్లు అనేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఛాన్స్ వస్తే ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే నెటిజన్లు.. ఇప్పుడు దీనిపై మీమ్స్ తయారు చేసి దేవరకొండని కామెడీ చేస్తున్నారు. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts