అమెరికాలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఓ తెలుగుతేజం అద్భుత విజయం సాధించాడు.
బృహత్ సోమ అనే 12 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి టైటిల్ ను గెలుచుకున్నాడు.
సహచర విద్యార్థి ఫైజన్ జకీతో టైబ్రేకర్ లో హోరాహోరీగా తలపడి విజయం సాధించాడు. కేవలం 90 సెకన్ల వ్యవధిలో 30 ఆంగ్ల పదాలకుగాను ఏకంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్ లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నగదు బహుమతి కింద 50,000 డాలర్లతోపాటు (రూ. 41.6 లక్షలు) ట్రోఫీ, ప్రశంసా పత్రం అందుకున్నాడు.
అబెసిల్ (abseil) అనే పదానికి చివరగా సరైన స్పెల్లింగ్ ను చెప్పడం ద్వారా బృహత్ ఈ పోటీలో విజయం సాధించాడు.
ఫ్లోరిడాకు చెందిన అతను ప్రస్తుతం సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు.
బృహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా కావడం విశేషం.