telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇద్దరు ఐపీఎస్ లు .. ఇన్నాళ్లు చేసింది ఇదేనా.. ఆర్టీసీ కేసుపై హైకోర్టు ఆగ్రహం..

high court on new building in telangana

తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ ను అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను పరిశీలించిన హైకోర్టు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ పై తమకు అనుమానాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ ఇంచార్జ్ ఏండి సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఆర్టీసీ సంస్థ కోసం దాఖలు చేసిన అఫిడవిట్ లా లేదని జిహెచ్ఎంసి సంస్థ కోసం దాఖలు చేసిన అఫిడవిట్ లా ఉందంటూ విమర్శించారు అశ్వద్ధామ రెడ్డి. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ లు ప్రభుత్వం ఏది చెప్తే అది అఫిడవిట్లో రాసుకొచ్చి హై కోర్టుకు సమర్పించారని అశ్వద్ధామ రెడ్డి అన్నారు. అటు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను పరిశీలించిన హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసిందని అశ్వద్ధామ రెడ్డి అన్నారు. ఆర్టిసి తరఫున అక్కడ పెట్టు దాఖలు చేశారా లేక ఇంకెవరి కోసమైనా అఫిడవిట్ దాఖలు చేశారా అంటూ న్యాయస్థానం ప్రశ్నిస్తే ఆర్టీసీ యాజమాన్యం కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయింది అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు.

Related posts