లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం నయనతార తమిళ యువదర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ దొరికితే వీరిద్దరూ విదేశాలకు వెకేషన్ కు ఎగిరిపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట గ్రీస్ లోని ఏథెన్స్ లో విహరిస్తోంది. ఏథెన్స్ లో విగ్నేష్ శివన్, నయనతార ఫోటో ఒకటి నెటిజన్లని విశేషంగా కట్టుకుంటోంది. నయనతార అదిరిపోయే గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఇక విగ్నేష్ శివన్ నయనతార వెనుక అద్దంలో ప్రతిబింబంలో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకు భారీగా లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో ఈఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
							previous post
						
						
					
							next post
						
						
					

