శివసేనపై అమరావతి స్వతంత్ర్య ఎంపీ, నటి నవనీత్ కౌర్ రానా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్లో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డ నవనీత్ కౌర్… తాజాగా శిశసేన ఎంపీ అరవింద్ సావంత్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడితే తనపై యాసిడ్ పోస్తానని.. జైలుకు పంపుతానని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించాడని ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపించారు. అంతేకాదు.. తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్‌తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన లేఖలు వచ్చినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే.. నవనీత్‌కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరిస్తే.. తాను మహిళలకే మద్దతుగా నిలుస్తానని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఆడిస్తున్న నాటకమని ఆయన ఫైర్ అయ్యారు.
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎంపీ సీట్లు గెలవాలి: కేటీఆర్