telugu navyamedia
రాజకీయ

రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య‌నాయుడుకు విడ్కోలు.. ఇది ఉద్వేగభరితమైన క్షణమ‌న్న ప్ర‌ధాని మోదీ

*రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య‌నాయుడుకు విడ్కోలు..
*వెంక‌య్య‌నాయుడు అత్యంత జ‌నాద‌ర‌ణ ఉన్న నేత‌
*ఆయ‌న‌తో భుజం క‌లిపి ప‌నిచేసే అనుభ‌వం నాకు ఉంది..
*వెంక‌య్య నాయుడు అనేక బాధ్య‌త‌లను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించారు
వెంక‌య్య నాయుడు సుదీర్ఘ అనుభ‌వంతో సేవ‌లు అందించారు..
ఎప్పుడు యువ‌త భ‌విష్య‌త్ కోసం త‌పించారు..
మీ పుస్త‌కంలో ప్ర‌తి అక్ష‌రం యువ‌త‌కు స్పూర్తి..

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అత్యంత జ‌నాద‌ర‌ణ ఉన్న నేత అని ప్ర‌ధాని మోదీ కొనియాడారు అన్నారు.ఆయ‌న‌తో భుజం క‌లిపి ప‌నిచేసే అనుభ‌వం నాకు ఉందని అన్నారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు.

నేను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను కానీ ప్రజా జీవితం నుంచి కాదు అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభను నిర్వహించే బాధ్యత నుంచి మాత్రమే మీరు తప్పుకుంటున్నారు. కానీ మీ అనుభవం మా లాంటి నేతలకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దక్కడం నా అదృష్టంఅని మోదీ అన్నారు 

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని  ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు

మీ ఛలోక్తులకు ఎదురు లేదు.. మీరు ఒకసారి కౌంటర్ వేస్తే ఇక దాని గురించి మాట్లాడటానికి కూడా ఏం ఉండదు. మీరు మాట్లాడే ప్రతి మాటా వినాలనిపిస్తుంది. వాటికి తిరిగి కౌంటర్ వేసే ధైర్యం కూడా ఎవరికీ ఉండద‌ని అన్నారు.

చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు.మీ పుస్త‌కంలో ప్ర‌తి అక్ష‌రం యువ‌త‌కు స్పూర్తి అని అన్నారు.

రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిధాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.

Related posts