telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దళిత యువకుని మృతిపై విచారణ చేపట్టాలి: లోకేశ్ డిమాండ్

Nara Lokesh

పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా కందూరు గ్రామంలో ఓం ప్రకాశ్ అనే దళిత యువకుడు చనిపోయాడని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న వైకాపా ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలి. దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా? దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ట్విట్టర్ లో లోకేశ్ మండిపడ్డారు.

ఓటేసిన వారినే కాటేస్తున్నారు వైఎస్ జగన్. మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాశ్‌ని బలితీసుకున్నారు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఓం ప్రకాశ్ మృతిపై విచారణ చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Related posts