telugu navyamedia
రాజకీయ వార్తలు

మయన్మార్‌ : … తిరుగుబాటు దారుల చెర నుండి.. ఎంపి సహా భారతీయుల విడుదల..

mp and Indians released from terrorists

అరకాన్‌ ఆర్మీ (యుఎల్‌ఎ) పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న మయన్మార్ తిరుగుబాటుదారుల చెర నుండి ఎంపితోపాటు సహా ఐదుగురు భారతీయులు విడుదలయ్యారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం వేగంగా స్పందించిందని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. చిన్‌ రాష్ట్రంలో పాలెట్వా నుండి క్యాక్తువాలోని రాఖైన్‌కు వెళ్తున్న సమయంలో మయన్మార్‌ ఎంపి, ఇద్దరు స్థానిక రవాణాదారులు, ఇద్దరు స్పీడ్‌ బోట్‌ ఆపరేటర్లను వారు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌ అయిన వారు భారత్‌- మయన్మార్‌ సంయుక్తంగా చేపట్టిన కలదాన్‌ రోడ్‌ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తున్నారు.

అరకాన్‌ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఒక వ్యక్తికి డయాబెటిస్‌ కారణంగా గుండెపోటుతో మృతిచెందాడని పేర్కొంది. విడుదలైన వారితో పాటు మృతదేహాన్ని కూడా మంగళవారం యాంగోన్‌కు చేర్చినట్లు తెలిపారు. రఖీనే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బౌద్ధుల స్వయం ప్రతిపత్తి కోసం యుఎల్‌ఎ దశాబ్దం నుండి పోరాటం చేస్తోంది. తాము మయన్మార్‌ ఎంపిని టార్గెట్‌గా చేసుకున్నామని, భారతీయ పౌరులను కాదని కిడ్నాపర్లు ప్రకటించారు.

Related posts