న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అమిత్ షా గారి కి వివరించారు.
తుపాను నష్టంపై నివేదికను రాష్ట్ర హోంమంత్రి అనిత గారితో కలిసి ఈ సందర్భంగా అందజేశారు.
మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయి.
మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

