నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. మరోవైపు నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆన్లైన్ క్లాసులు తన కొడుకు కోసం. తనయుడు జున్ను కోసం నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూ, అర్థమయ్యేలా వివరిస్తున్నారు.
కాగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్లైన్ క్లాసులకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 3వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామంటూ సెప్టెంబర్ 14వ తేదీ వరకు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇక 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒక్కో క్లాస్ టైం 30 నిమిషాలు అంత కన్నా తక్కువే.. ఉండే విధంగా ప్లాన్ చేశారు. ప్రతీ విద్యార్థికి క్లాసెస్ రీచ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.