telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీపీఐ నారాయణకు కాస్త అన్నం పెట్టండి… ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు ..

సీపీఐ నారాయణపై జనసేన నేత, నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌‌లపై నారాయణ చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి.. ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడని ట్విట్టర్ వేదికగా నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవలి కాలంలో మెగా అభిమానులు, జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. అందుకే మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి…కాస్త అన్నం పెట్టండి …! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాఅంటూ నాగబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

కాగా..ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని కామెంట్ చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.

“పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రజలను మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణను పక్కనబెట్టి ఈ చిల్లర బేరగాడ్ని చిరంజీవిని స్టేజి మీదకి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రాలేదో నాకు తెలియదు. కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. పవన్‌ కళ్యాణ్‌ ఓ ల్యాండ్ మైన్ వంటివాడు. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఆయన కూడా అంతే. ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదంటూ నారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పై కూడా నారాయణ విమర్శలు చేయడంతో నాగబాబు ట్విట్టర్ లో నారాయణపై ఈ విధంగా స్పందించారు.

Related posts