తమ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ తప్ప ఎల్లోమీడియాకు కాదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులజాడ్యం టీడీపీకే ఉందని, సలహాదారులకు కూడా కులాలు అంటగడతారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సలహాదారుల కన్సల్టెన్సీ పేరుతో జరిగిన దోపిడీని బయటపెడితే సిగ్గుతో తలదించుకుంటారా? అని తెలుగుదేశం పార్టీ నేతలకు శ్రీకాంత్ రెడ్డి సూటిప్రశ్న వేశారు.
వైసీపీ మరోనేత గొల్ల బాబూరావు మాట్లాడుతూ, శాసనసభా సమావేశాల్లో చంద్రబాబు తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో శాసనసభలో ఏనాడూ కూడా ప్రజాసమస్యలపై చర్చ జరగలేదని అన్నారు. జగన్ హయాంలోనే దీనిపై సుదీర్ఘ చర్చ జరుగుతోందని అన్నారు. శాసనసభలో చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు:నారాయణ