కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎవ్వరి ఇంట్లో వారే ఉంటున్నారు. సినిమా షూటింగ్స్ సహా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ కరోనా పట్ల అవగాహన పెంపొందిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. అంతేగాక ఆన్‌లైన్ చాట్స్ చేస్తూ తమ మనుసులో మాటలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా యాంకర్ రవితో లైవ్ చాట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. చిరంజీవిగారు నటించిన సినిమాల్లో ఏదో ఒక సినిమాను వరుణ్ తేజ్‌తో రీమేక్ చేయాల్సివస్తే ఏ సినిమా చేస్తారని రవి అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య చేసిన సినిమాల్లో నాకు ‘ఛాలెంజ్’ మూవీ చాలా ఇష్టం. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్‌కి ఈ సినిమా అయితే బాగా సూట్ అవుతుందని అనిపిస్తుంది. అలాగే అన్నయ్య సినిమాల్లో ‘కొదమ సింహం’ కూడా నా ఫేవరేట్ మూవీ. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించిన ఈ మూవీ కూడా వరుణ్ తేజ్‌కు సెట్ అవుతుందని అనుకుంటున్నా అని చెప్పారు. కాకపోతే అన్నయ్య చేసిన సినిమాలను రీమేక్ చేసి మెప్పించడం అంత సులువైన విషయం కాదని నాగబాబు అన్నారు. ఒకవేళ ఆ సినిమా చేయాల్సివస్తే అది వరుణ్‌కి పెద్ద సవాల్ అవుతుందని ఆయన చెప్పారు.
previous post


అందుకే చెయ్యి కోసుకున్నా… బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలు