telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

ఏపీలో సైర్మా కంపెనీ రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద చేపట్టే ఏడు ప్రాజెక్టులో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఏడు యూనిట్ల మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో నెలకొల్పనున్నారు.

సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది.

దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో నెలకొల్పనున్నారు.

ఈ ఏడు ప్రాజెక్టులను మూడు రాష్ట్రాల్లో రూ. 5,532 కోట్లతో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఆమోదముద్ర వేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఏడు ప్రాజెక్టుల్లో మొత్తం రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు అవుతాయని చెప్పారు.

ఈ ప్రాజెక్టు వల్ల 5,195 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని.. పరోక్షంగా అనేక మంది ఉపాధి పొందుతారని తెలిపారు.

Related posts