ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పచ్చి మోసకారని కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు. 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పుడు మాట్లాడంటం లేదన్నారు. కేసులు నుండి బయట పడటానికే కేంద్రంతో లాబీయింగ్ చేశారని దుయ్యబట్టారు.
సీఎం సీటు జగన్‌కి పర్మినెంట్ కాదన్నారు. హిట్లర్ లాంటి వాల్లే కాలగర్భంలో కలిశారని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి చరిత్ర అంతకంటే హీనమన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని మండిపడ్డారు. చంద్రబాబు పై నమ్మకంతో రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు.