మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా యాంకర్ రఘు ఉండగా, ఏ2గా రేవతి ఉన్నారు. దీనిలో భాగంగానే రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదయం రేవతి ఇంటి వద్దకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. రేవతి అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్