ప్రధాని మోదీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. అక్రమ చొరబాటుదారుల విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తన వైఖరిని మార్చుకున్నారని దుయ్యబట్టారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో ఆయన విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇదే మమతా బెనర్జీ గతంలో అక్రమ చొరబాటుదారులను కట్టడి చేయాలని పార్లమెంట్‌లో కోరారని మోదీ అన్నారు. అలాగే శరణార్థులను ఆదుకోవాలన్నారని చెప్పారు. ఇప్పుడు అదే వ్యక్తి పౌరసత్వ సవరణ చట్టంపై ఐక్యరాజ్యసమితికి వెళతామంటున్నారంటూ మమత వ్యాఖ్యలను ప్రస్తావించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.
దీదీ మీకు ఏమైంది. ఎందుకు మీ వైఖరిని మార్చుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఎన్నికలు వస్తాయి. పోతాయి. ఎందుకు భయపడుతున్నారు. బెంగాల్ ప్రజలపై మీకు నమ్మకం లేదా.. అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్