telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనీలాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో పాకిస్థాన్ బ్యూటీ

Sofia

పాకిస్థాన్ సినీనటి, మోడల్ సోఫియా మీర్జాకు మనీలాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో ప్రమేయం ఉందని పాక్ నేషనల్ అకౌంట్‌బులిటీ బ్యూరో (ఎన్ఎబీ) దర్యాప్తులో తేలింది. సోఫియా మీర్జా సాగించిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా అత్యంత వివాదాస్పదంగా పేరొందింది. కొంత కాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదైనాయి. సుసార్ ఇన్ లా నాటకంలో నటించిన సోఫియా పలు నాటకాలు, సీరియళ్లు, వాణిజ్య ప్రకటనల్లో నటించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం పుకార్లేనని సోఫియా కొట్టిపారేశారు. నార్వే దేశంలో నివాసం ఉంటున్న తన మాజీ భర్త చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆమె ఆరోపించారు. 2015లో సోఫియా 506,800 డాలర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అనుమతి లేకుండా యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కగా ఇస్లామాబాద్ లోని షహీద్ బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

Related posts