telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ – విచారణ జూలై 29కి వాయిదా

 వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో ఇవాళ (గురువారం జులై 24) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు మిథున్‌రెడ్డి.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

కాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లని వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

Related posts