ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. పట్టణంలోని బండ్లవంకలో నివాసముంటున్న సంపూర్ణమ్మ భర్త మృతి చెందడంతో ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె విజయలక్ష్మి 8వ తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. కాగా ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన గురు సంపూర్ణమ్మ ఇంటి వద్దకు వచ్చి విజయలక్ష్మితో మాట్లాడాలని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న సంపూర్ణమ్మ పై దాడి చేశాడు. భయపడ్డ ఆమె పొరుగింట్లో ఉండే బంధువులు పిలుచుకుని వచ్చేందుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లోని గది తలుపులు మూసి ఉండడంతో పగులగొట్టుకుని లోపలికి వెళ్లి చూడగా అప్పటికే విజయలక్ష్మి ఉరేసుకుని కనిపించింది. గురు అక్కడి నుంచి పరారయ్యాడు. కొన్ని రోజులుగా గురు తన కుమార్తె వెంటపడుతూ వేధిస్తున్నాడని, ఈ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని సంపూర్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
							previous post
						
						
					
							next post
						
						
					

