telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు.. ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా.. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా అని ప్రశ్నించారు. తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బ్రతకరు. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నవు. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు. నువు ఎన్ని టాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి అని అన్నారు. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది అని తెలిపారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్న. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారు అన్నారు. కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని ఈటల పేర్కొన్నారు.

Related posts