బయోమెట్రిక్ సర్వర్‌లో ప్రాబ్లమ్స్ ఏర్పడడం వల్ల బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరుగుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెల్లరేషన్‌కార్డు దారులకు ఈనెలంతా బియ్యం పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. చాలా చోట్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని సరిచేసే పనులను అధికారులు చేపట్టారని తెలిపారు. అవసరమైతే మాన్యువల్ విధానంలో బియ్యం పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని మంత్రి తెలిపారు.
బియ్యం అందవేమోన ని ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేబాద్యత ప్రభుత్వానిదని చె ప్పారు. ఇబ్బందులు పడుతూ గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద క్యూ లైన్‌లో నిలబడ వద్దన్నారు. గుంపులు గుంపులుగా రేషన్‌షాపుల వద్దకు రావద్దని చెప్పారు. దీని వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.