ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖలోని శారదా పీఠంలో సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
సీఎం రాక సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు సైతం శారదా పీఠానికి చేరుకున్నారు. ఆయనతో పాటు కొందరు అనుచరులు కూడా వచ్చారు. మంత్రి లోనికి వెళ్తుండగా గేటు వద్దే ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అడ్డుకున్నారు. లోనికి వెళ్లానుకుంటే మంత్రి ఒక్కరు వెళ్లవచ్చని, ఆయన అనుచరులను లోనికి అనుమతించేది లేదని సీఐ తేల్చి చెప్పారు.
మంత్రి బతిమాలినా సీఐ అందర్నీ లోనికి అనుమతించలేదు. సీఐ కాస్త దురుసుగా మంత్రి ముఖంపైనే గేటు వేసేసి.. వెళ్తే మంత్రి ఒక్కరే లోపలకి వెళ్లే అవకాశం ఉందని, ఇతరులు వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో గేటు వద్ద మంత్రిని సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్భషలాడారు.
దీంతో తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు , ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. ఇలా వాగ్వివాదం కొద్ది సేపు జరిగినా సీఐ క్షమాపణలు చెప్పక పోవడంతో చివరికి చేసేది లేక పోలీసులకు నమస్కారం పెట్టి.. అక్కడ నుంచి మంత్రి వెనుదిరిగారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్