ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా లేక గ్రామమా ? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. పదిశాతం ప్రజలకు సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదన్నారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. శాసన సభను సమావేశపరిచి రాజధానిపై వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.
previous post
కేసీఆర్ బెదిరింపులతో అలీ వైసీపీలో చేరారు: బుద్ధా వెంకన్న