telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రుషికొండ బీచ్‌ అభివృద్ధిపై మంత్రి దుర్గేష్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటన – బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపుకు మరింత బలోపేతం

రుషికొండ బీచ్‌ను మంత్రి కందుల దుర్గేష్ , భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  ఈరోజు (గురువారం) సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని వెల్లడించారు.

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ బీచ్ పరిశుభ్రత అనేది రాజకీయ నాయకులు, అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉందన్నారు.

గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

ఈ ప్రాంతం బీచ్ కాకుండా రాష్ట్రంలో మరో బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

పాండిచ్చేరి ప్రభుత్వంతో మాట్లాడి క్రూజ్‌ను మళ్ళీ తీసుకురావడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

గత సంవత్సరం కాలంగా రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి పాలన సాగిస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొనియాడారు.

రాష్ట్రంలోనే బ్లూ ఫ్లాగ్ గుర్తుంపున్న ఏకైక బీచ్ రుషికొండ బీచ్ అని తెలిపారు. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు.

మొన్ననే టీసీఎస్ వచ్చిందని.. గూగుల్ కూడా దాదాపు రావడానికి ఖాయమైందన్నారు.

అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతంగా రుషికొండ బీచ్ ప్రత్యేకమైనదని అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Related posts