telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముస్లింలు సొంతంగా రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలి: ఒవైసీ పిలుపు

MIM Comments MP Elections

రాజస్థాన్ లోని హిందుత్వ మూకలు దాడి చేయడంతో పెహ్లూ ఖాన్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పెహ్లూఖాన్ కుటుంబంపైనే పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. ఈ విషయమై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రతిబింబం మాత్రమేనని ఒవైసీ స్పష్టం చేశారు. రాజస్థాన్ లో ఉన్న ముస్లింలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సమర్థించే వ్యక్తులు సంస్థలను గుర్తించి బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

ముస్లింలు సొంతంగా తమ రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 70 ఏళ్లుగా ముస్లింలు మౌనంగా ఉండిపోయారని అన్నారు. ఇప్పటికయినా ముస్లింలు మేల్కోవాలనీ ఒవైసీ ట్వీట్ చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఆవులను తరలించినందుకు పెహ్లూ ఖాన్ కుమారులపై రాజస్థాన్ పోలీసులు తాజాగా కేసు నమోదుచేశారు.

Related posts