telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మైకేల్ జాక్సన్ ను బ్రతికిస్తా… వారితో కలిసి నాతో రాత్రంతా…!

Miley

అమెరికాకు చెందిన పాప్ సింగర్ మైలీ సైరస్‌కు డేవిడ్ రమ్సే (42) వీరాభిమాని. ఆమె పాటలన్నీ వినేవాడు. ఆమె షోలన్నింటికీ వెళ్లేవాడు. అతని అభిమానం అక్కడితో ఆగలేదు. ట్విటర్ వేదికగా ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపసాగాడు. దీంతో మైలీ బాడీగార్డులు డేవిడ్‌పై నిఘా పెట్టారు. ఇటీవల లాస్‌వెగాస్‌లో ఓ లైవ్ ప్రోగ్రాం ఇస్తుండగా… అక్కడకు వచ్చిన ప్రేక్షకులందరికీ డేవిడ్ ఫొటోలను అందించారు. అతను ఎక్కడ కనిపించినా తమకు సమాచారమివ్వాలని కోరారు. ఇది తెలియని డేవిడ్ ఆ ప్రోగ్రాంకు వచ్చి బాడీగార్డులకు దొరికిపోయాడు. దాంతో పెద్దగా కేకలు వేసిన డేవిడ్.. మైలీని గర్భవతిని చేయడం తన జీవిత ధ్యేయమంటూ అరిచాడు. ట్విటర్‌లో కూడా అతను ఇలాంటి ట్వీట్లే చేసేవాడు. మైలీతో ఒంటరిగా గడపాలనుందని, హోటల్ రూమ్ కూడా బుక్ చేశానన్నాడు. మైలీ వస్తే ఇద్దరూ సంతోషంగా గడపొచ్చంటూ వ్యాఖ్యలు చేశాడు. మైలీని బాధ పెట్టుంటే క్షమించాలని, దీనంతటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమని అన్నాడు. అనంతరం చనిపోయిన పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్, ప్రిన్స్ తదితరులను తాను మళ్లీ బతికిస్తానని, వారితో కలిసి ఓ రాత్రంతా తనతో గడపాలని మైలీకి చెప్పాడు. మైలీ బాడీగార్డుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డేవిడ్‌ను అరెస్టు చేశారు.

Related posts