మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య గారి మృతి తీరని విషాదమని, ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని చిరు కొనియాడారు.
ఆయన రాజకీయాలలో భీష్మాచారుడి వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆ ఓ రుషిలా సేవ చేశారు.
‘రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర‍్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య’ అని చిరంజీవి పేర్కొన్నారు.