మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ 2022 జనవరి 7న ప్రప్రంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్శించారు.
ఇకపోతే ..గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెమ్మ్యూనరేషన్ మ్యాటర్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019లో వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా మారాడు.
దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు రామ్ చరణ్.
ఇవి రెండూ కూడా వచ్చే ఏడాదే రిలీజ్ కానుండగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 15వ సినిమా కూడా చేస్తున్నాడు.. శంకర్ చిత్రం కోసం రామ్ చరణ్ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న చెర్రీ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించగా అవన్నీ అసత్యాలుగా కొట్టిపారేశాడు. ‘అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు?’ అవన్నీ ఫేక్ వార్తలే అని తేల్చేశారు.
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్