telugu navyamedia
తెలంగాణ వార్తలు

న్యూ ఇయర్ కు టీఎస్‌ఆర్టీసీకు బంపరాఫర్..

కొత్త సంవత్సర వేడుకలు సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది…న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.. కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా.. జనవరి 1న తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే 12ఏళ్ల పిల్లలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొంది.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఆదేశాలు జారీచేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. ఆ వయసు పిల్లలు తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రచారం కల్పించాలని సజ్జనాలు ఆదేశించారు.

కాగా న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనున్నది… డిసెంబర్‌ 31వ తేదీన సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు… హైదరాబాద్‌ శివారుల్లోని 15  ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈవెంట్స్ కు వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజాము 3 గంటలవరకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. అర్ధరాత్రి వేళ.. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు ఈ బ‌స్సుల‌ను వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో ఏపీ ఆర్టీసీ 50శాతం అదనపు ఛార్జీలు పెంచగా.. టీఎస్ఆర్టీసీ మాత్రం ఛార్జీలు పెంచడం లేదు. ఈ అంశంపై కూడా సజ్జనార్ ప్రచారం కల్పిస్తూ ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ లాభాల బాట పట్టించారు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ఓ ట్రాక్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే.

 

Related posts